అమరావతిలో అలనాటి శాసనం

31 Aug, 2015 08:21 IST|Sakshi
అమరావతిలో అలనాటి శాసనం

గుంటూరు జిల్లా అమరావతిలో పురాతన శాసనం, శివలింగం, శిల్పాలు బయటపడ్డాయి. వాటిని స్థానిక మ్యూజియానికి తరలించారు. 250 ఏళ్లనాటి అమరేశ్వరాలయ గోపురాన్ని నెలరోజులుగా కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆరు బౌద్ధశిల్పాలు వెలుగు చూశాయని హిందూ ధర్మరక్షణ సమితి ప్రతినిధి రామనాథ్ పురావస్తుశాఖాధికారులకు తెలిపారు.

తవ్వకాలలో బయటపడిన శిల్పాలను స్థానిక పురావస్తుశాఖ మ్యూజియం ఇన్‌చార్జి ఎన్.వెంకటేశ్వరరావు పరిశీలించి అవి బౌద్ధశిల్పాలని గుర్తించారు. నల్లరాయిపై శాసనం రాసిన శాసనం, మూడో శతాబ్దానికి చెందిన చలువరాతి లింగం, మాలవాహకుల శిల్పం లభించినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు. మిగిలిన శిల్పాలను పరిశీలించాల్సి ఉందన్నారు.     
-అమరావతి

మరిన్ని వార్తలు