చింతలపూడి ఆంధ్రాబ్యాంక్లో చోరికి యత్నం

30 Oct, 2014 09:32 IST|Sakshi

చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఆంధ్రాబ్యాంక్లో దుండగులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ కార్యాలయంలోని కిటికీ అద్దాలు పగులగొట్టి  దొంగలు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది.  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

 

ఘటనా స్థలానికి చేరుకున్న చింతలపూడి పోలీసులు విచారిస్తున్నారు. కాగా బ్యాంక్లో నగదు చోరీకి గురైందా లేదా అనే దానిపై పోలీసులు ఇంకా నిర్థారణకు రాలేదు. చోరీ యత్నంపై బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించారు.  బ్యాంక్ అధికారులు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.  మరోవైపు క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్వ్కాడ్ కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు