రాజధానులు ఎంతెంత దూరం

20 Jan, 2020 15:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రతిపాదించిన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వికేంద్రీకరణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 

(చదవండి : రాజధాని రైతులకు వరాలు)

సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర సమతుల అభివృద్ధికి అధికార వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి , రాజధాని ప్రాంతీయ అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ) ను రద్దు చేస్తూ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. అలాగే రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తారని ముందస్తు సమాచారంతో ఆ పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలను టీడీపీ నాయకులు ముందుగానే కొనుగోలు చేసుకుని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఎలా పాల్పడినారో సమగ్రంగా వివరించారు. భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల పేర్లు, వారి బినామీ పేర్ల జాబితాను బయటపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ ఎందుకు అవసరం? గతంలో చేసిన తప్పిదాలు, వాటివల్ల జరిగిన నష్టాలను వివరించారు. చరిత్రలో రాజధానులు ఏర్పాటుకు దోహదం చేసిన అంశాలు, రాజధాని ఎంపిక, నిర్మాణాల విషయంలో శ్రీకృష్ణ కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ), హైపవర్ కమిటీల నివేదికలు ఏం చెప్పాయన్న వివరాలను సభలో వివరించారు. 

(చదవండి : ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?)

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రస్తుతం చెల్లిస్తున్న పరిహారాన్ని మరింత పెంచుతున్నట్టు మంత్రి బొత్స సభలో వెల్లడించారు. ఆయా గ్రామీల సమగ్రాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై సుదీర్ఘంగా సాగిన చర్చలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పాల్గొని చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టారు. ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు వాటి రాజధానులు ఎలా ఉన్నాయో ఉదహరించారు. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకన్నా తాను రాష్ట్ర అభివృద్ధినే కాంక్షిస్తానని స్పష్టం చేశారు. 

వికేంద్రీకరణలో భాగంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేస్తే అది మిగతా ప్రాంతాలకు దూరమవుతుందన్న ప్రతిపక్ష వాదనను అధికారపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి ప్రాతిపదికలను ఉదాహరణలతో వివరించారు. ఆయా రాష్ట్రాల రాజధానులు ఎంతెంత దూరంలో వెలిశాయన్న వివరాలను వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ అనేక రాష్ట్రాలకు దూరంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. 

రాజధానులు వాటి మధ్య దూరాలపై కొన్ని ఉదాహరణలు :


 


 

మరిన్ని వార్తలు