ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

17 Dec, 2019 20:31 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏడు రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో 22 కీలక బిల్లులు ఆమోదం పొందాయి. రాజధానిపై చర్చ అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ సమావేశాల్లో దిశ బిల్లు -2019తో పాటు పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. అన్నింటినీ ఆమోదించుకోగలింది. శాసన మండలిలో మొత్తం 32.5గంటల పాటు సభ్యులు మాట్లాడారు. 58 స్టార్‌ క్వశ్చన్స్‌, 37 పేపర్స్ ఆన్ టేబుల్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రెండు స్వల్పకాలిక చర్చలు జరిగాయి. 

మరిన్ని వార్తలు