ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా

17 Jun, 2020 15:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ 2020-21 కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌)ను అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధించి రాష్ట్ర శాసనసభ నేడు ఒక తీర్మానం ఆమోదించింది.

భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు. ఇదిలాఉండగా.. బడ్జెట్‌ ఆమోదానికి ముందు సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభ్యులు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారం ప్రకటించారు.
(చదవండి: నేను కూడా డిప్రెష‌న్‌ను ఎదుర్కొన్నాను)

మరిన్ని వార్తలు