ఏపీ అసెంబ్లీ: ముగిసిన బీఏసీ సమావేశం

27 Jan, 2020 11:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఏపీ కేబినెట్‌ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం అందించింది. అయితే ఈ రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటే బీఏసీ సమావేశం కావాలని స్పీకర్‌ సూచిస్తూ అసెంబ్లీని వాయిదా వేశారు. బీఏసీ సమావేశం అనంతరం తిరిగి సభ ప్రారంభం కానుంది.  

ముగిసిన బీఏసీ సమావేశం..
ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ ఒక్క రోజు(సోమవారం) మాత్రమే అసెంబ్లీ జరపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా నేటి అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించాలని ని​ర్ణయించింది. మండలి రద్దుతో పాటు మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు బీఏసీ సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఈ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కన్నబాబు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దికి సంబంధించిన పలు కీలక బిల్లులను శాసనమండలి అడ్డుకుంటున్న నేపథ్యంలో మండలిని రద్దుపై చర్చించనుంది. ఇప్పటికే ఏపీ కేబినెట్‌ శాసనమండలి రద్దుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అభివృద్ది-పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ వంటి కీలకబిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకుంటూ సైంధవ పాత్ర పోషిస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తామని శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

చదవండి:
ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం

లోకేష్‌ తీరు... బాగా బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకెళ్లి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు