ఆటోమొబైల్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

24 Mar, 2018 01:49 IST|Sakshi
హీరో మోటార్‌కార్ప్‌ చిత్తూరు ప్లాంటుకు శంకుస్థాపన చేస్తున్న సీఎం

హీరో మోటార్‌కార్ప్‌ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు

సాక్షి, చిత్తూరు: తిరుపతి, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలను కలుపుతూ ఆటోమొబైల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామమని చెప్పారు. చిత్తూరులోని శ్రీసిటీ సమీపంలో శుక్రవారం హీరో మోటార్‌కార్ప్‌ చిత్తూరు ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మన రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనుౖవైన ప్రాంతమన్నారు. దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ హీరో ప్లాంటు లేదని తెలిపారు. చిత్తూరు ప్లాంటు నిర్మాణం కోసం రూ.1,600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హీరో మోటార్‌కార్ప్‌ సీఎండీ పవన్‌ముంజాల్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు