ఏపీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న యనమల

20 Aug, 2014 11:12 IST|Sakshi
ఏపీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న యనమల

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ 2014-15 బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యనమల ప్రసంగిస్తూ   గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్ర విభజనతో పరిస్థితి మరింత క్లిష్టమైందన్నారు. అస్తవ్యస్థతను తీర్చిదిద్దాల్చిన బాధ్యత తమపై ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు రూ.లక్షా12 వేల కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను ఆయన  అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

*2014 - 2015 కాలానికి మొత్తం రూ.1,11, 884 కోట్ల బడ్జెట్‌
*రూ.85,151 వేల కోట్ల ప్రణాళికేతర వ్యయం
*రూ.26,673వేల కోట్ల ప్రణాళికా వ్యయం
*రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు
*ఆర్థిక లోటు రూ.12, 064వేల కోట్లు
*ద్రవ్యలోటు రూ.19,028 కోట్లు
*విజన్ 20-29 ఫార్ములాకు ప్రతిపాదన

మరిన్ని వార్తలు