ఇసుక అక్రమంగా తరలిస్తే జైలే!

13 Nov, 2019 17:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈమేరకు నిబంధనలను సవరించింది. ప్రస్తుతం అక్రమాలకు పాల్పడితే స్వల్ప జరిమానాలతోనే సరిపెట్టే విధంగా ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌–1966 ఉన్నాయి. వీటికి మరింత పదును పెట్టి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అధిక ధరలకు విక్రయిస్తే రెండేళ్ల పాటు జైలు శిక్షతోపాటు రూ.రెండు లక్షల జరిమానాలు విధించేలా నిబంధనలు సవరిస్తూ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.  

మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు

ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షల వరకూ కనీస జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ గణుల చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం
ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వల, బ్లాక్‌ మార్కెటింగ్‌, పునర్వివిక్రయాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయం
నవంబర్‌ 14 నుంచి ఇసుక వారోత్సవాలు
రోజుకు 2లక్షల టన్నుల వరకూ ఇసుక సరఫరా
వచ్చే 10 రోజుల్లో ఇప్పటివరకూ ఉన్న కొరతను పూర్తిగా తొలగించాలని నిర్ణయం

కాలుష్యం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజిమెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదరం
పారిశ్రామిక వ్యర్ధాలతో పాటు ఇతర వ్యర్ధాల సేకరణ, రవాణా, నిల్వ, శుద్ది నిర్వహణపై పనిచేయనున్న ఏపీఈఎంసీ
అక్రమంగా పారిశ్రామిక వ్యర్థాలను డిస్పోజ్‌ చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టడానికి, వ్యర్థాలను తీసుకెళ్తున్న వాహనాలను సరిగ్గా ట్రాక్‌ చేయడానికి ఏపీ పర్యావరణ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధనకు కేబినెట్‌ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి6 తరగతుల వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన. తెలుగు లేదా ఉర్ధూ తప్పనిసరి సబ్జెక్ట్‌.
మిగిలిన తరగతుల్లో ఒక్కొక్క ఏడాదీ, ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లీష్‌ మీడియంలో బోధన. 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన కోసం తల్లిదండ్రులు, ఇతర మేధావులనుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వచ్చిందన్న మంత్రి వర్గం
ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 98.5శాతం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారని వెల్లడి

నవరత్నాల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మరోహామీ అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
సముద్రంలో వేటకి వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే ఆ కుటుంబానికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
18 నుంచి 60 ఏళ్ల వయసు ఉండి, వైఎస్సార్‌ బీమా పథకం కింద నమోదు చేసుకున్నవారికి ఈ పథకం వర్తింపు
వైఎస్సార్‌ మత్య్సకార భరోసా కింద ఈ పథకం అమలు
నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభం

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అనధికారిక  లేఔట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు-2019కు మంత్రివర్గ ఆమోదం
లేఔట్ల క్రమబద్ధీకరణ వల్ల మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల కొనుగోలు సదుపాయం లభించడం సలభమవుతుంది

ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ పాలసీ 2018, ఆంధ్రప్రదేశ్‌ విండ్‌ పవర్‌ పాలసీ-2018, ఆంధ్రప్రదేశ్‌ విండ్‌, సోలార్‌, హైబ్రిడ్‌ పవర్‌ పాలసీ 2018 సవరణకు కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం-2008 సవరణకు కేబినెట్‌ అమోదం
ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణకు మంత్రివర్గం ఆమోదం
హోంశాఖలో అదనపు పోస్టుల మంజూరుకు కెబినెట​ ఆమోదం
ఒక డైరెక్టర్‌, 3 డీఎఫ్‌ఓ ర్యాంకుతో అసిస్టెంట్‌ డైరెక్టర్ల పోస్టుల కొనసాగింపునకు ఆమోదం

రాష్ట్రంలోని 8 దేవస్థానాలకు ట్రస్ట్‌ బోర్డు మెంబర్ల నియామకానికి కేబినెట్‌ ఆమోదం. అవి

  1. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం-సింహాచలం
  2. శ్రీవీరవెంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానం- అన్నవరం
  3. శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం- ద్వారకా తిరుమల
  4. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం-విజయవాడ
  5. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం- శ్రీకాళహస్తి
  6. శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామి దేవస్థానం- శ్రీశైలం
  7. శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం- పెనుగంచిప్రోలు
  8. శ్రీస్వయంభూవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం-కాణిపాకం

ఆంధ్రప్రదేవ్‌ మున్సిపల్‌లా చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోదముద్ర
మొక్కజొన్న ధరలు పడిపోతుండడంపై మంత్రివర్గంలో చర్చ. వారంరోజుల క్రితం క్వింటాకు రూ.2200 ఉంటే.. ఇప్పుడు 1750కి పడిపోయిందని మంత్రి కన్నబాబు తెలిపారు.
రైతులు నష్టపోకుండా చూడాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలని సీఎం జనన్‌ ఆదేశించారు.
సీఎం జగన్‌ నిర్ణయాన్ని ఆమోదించిన మంత్రివర్గం.. ఈ రోజే విజయనగరం, కర్నూలు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు