కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

22 Jul, 2020 20:31 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్‌ నారాయణకు కేటాయించారు.(మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం)

సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. శంకర్‌ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.(కొత్త మంత్రులకు జనసేన ఎమ్మెల్యే అభినందనలు)

మరిన్ని వార్తలు