ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం

27 Jan, 2020 09:41 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. శాసనమండలి రద్దుపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌ నిర్ణయం తర్వాత అసెంబ్లీ చర్చించి, ఆ తర్వాత తీర‍్మానం చేయనుంది. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించనుంది. (శాసనమండలిపై నేడే నిర్ణయం)

కాగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష  తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. అలాగే అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు.(టీడీపీ తప్పుడు ప్రచారం.. వెలుగులోకి అసలు నిజం..!)


 

మరిన్ని వార్తలు