షావోమి సప్లయిర్స్‌తో ఏపీ సీఎం భేటీ 

11 Apr, 2018 12:17 IST|Sakshi

సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. షావోమి సప్లయిర్స్‌కు సంబంధించి 36 కంపెనీలతో ఆయన సమావేశమయ్యారు. చైనా నుంచి వచ్చిన మొత్తం 198 మంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతిలోని మానస సరోవరం హోటల్‌లో ఈ సమావేశం ఏర్పాటుచేశారు. షావోమి సప్లయిర్స్‌ ఏర్పాటుకు అన్ని రకాల ప్రోత్సహకాలను తాము అందజేస్తామని తెలిపారు. 

పరిశ్రమల ఏర్పాటులో రాయలసీమకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. షావోమి సప్లయిర్స్‌, జియో కంపెనీలు ఏర్పాటైతే, రూ.3వేల బిలియన్లు పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్‌ హబ్స్‌తో పాటు, ఆటో మొబైల్‌ హబ్‌గా కూడా రూపొందుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్ద ఎత్తున్న ఉద్యోగాల కల్పన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవలే షావోమి తన కొత్త మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను శ్రీసిటీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు