కరెంటు ఏపీది.. కాసులు తెలంగాణవి

9 Mar, 2015 00:41 IST|Sakshi

 చింతూరు :‘సొమ్మొకడిది సోకొకడిది’ అన్న సామెత విలీన మండలాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఆంధ్రాలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగించుకుంటున్న తెలంగాణ  అధికారులు అదే విద్యుత్తును విలీన మండలాలకు సరఫరా చేస్తూ ఈ మండలాల్లో విద్యుత్తు ద్వారా వస్తున్న ఆదాయాన్ని తన్నుకుపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, నెల్లిపాక మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమయ్యాయి. చింతూరు మండలంలోని లోయర్ సీలేరు ప్రాజెక్టు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం కూడా ఇదే జిల్లాలో విలీనమైంది. ఈ కేంద్రంలోని నాలుగు యూనిట్ల ద్వారా నిత్యం 460 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది.
 
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేంద్రం ద్వారా ఖమ్మం జిల్లాలోని కేటీపీఎస్ పరిధిలోని సీతారామపట్నం 220 కేవీ సబ్‌స్టేషన్‌కు 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగేది. ఇదే విద్యుత్తును జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వినియోగించేవారు. ఇక్కడి నుంచి భద్రాచలం సమీపంలోని ఎటపాక 132 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా జరిగి అక్కడి నుంచి విలీన మండలాలైన నెల్లిపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు సరఫరా చేసేవారు. ఇప్పుడీ మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైనా ఇప్పటి వరకూ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా విలీన మండలాల్లో చాలావరకు ప్రభుత్వ శాఖల విభజన ప్రక్రియ పూర్తయి ఆంధ్రా అధికారుల పాలన కొనసాగుతున్నా విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో విలీన మండలాల్లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధీనంలో ఇక్కడ విద్యుత్ సరఫరా జరిగేది. రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాలు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధీనంలోకి వెళ్లాల్సి ఉండగా, పైస్థాయిలో విభజన ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈ మండలాల్లో ఇంకా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిబ్బందే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
 
 విద్యుత్ శాఖ విభజన జరగకే..
 పవర్ కంపెనీల నడుమ విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాక పోవడంతో విలీన మండలాలకు సంబంధించి ప్రతినెలా సుమారు రూ.60 లక్షల ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్పోతోంది. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, నెల్లిపాక, వీఆర్‌పురంలలో గృహావసరాలకు సంబంధించి 30 వేలు, వ్యవసాయానికి 1124, కమర్షియల్‌కు సంబంధించి 1100, ఇండస్ట్రియల్‌కు సంబంధించి 22, ప్రభుత్వ శాఖలకు సంబంధించి 350 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా బిల్లుల రూపంలో ప్రతినెలా సుమారు రూ.60 లక్షల వరకు వసూలవుతుంటాయి. ప్రస్తుతం ఈ సొమ్ములన్నీ తెలంగాణ  ప్రాంతంలోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధీనంలోనే వసూలు చేస్తూ తెలంగాణ కు తీసుకెళుతున్నారు. తద్వారా ఆంధ్రా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అన్నిశాఖల మాదిరిగానే విద్యుత్‌శాఖకు సంబంధించి కూడా విభజన ప్రక్రియ చేసి ఉంటే ప్రభుత్వానికి ఈపాటికే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరి ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి విద్యుత్‌శాఖకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తిచేయాలని విలీన మండలాల ప్రజలు కోరుతున్నారు.
 
 విభజన ప్రక్రియ కొనసాగుతోంది..
 విద్యుత్‌శాఖకు సంబంధించి కూడా విభజన ప్రక్రియ కొనసాగుతోందని లోయర్ సీలేరు జలవిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ నాగభూషణరావు ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మాదిరిగానే ప్రస్తుతం పొల్లూరు కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఆంధ్రా, తెలంగాణ ల ఫీడర్లు మారే వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశముందన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కు ఎంత విద్యుత్ సరఫరా చేస్తున్నామనే దానిపై జలవిద్యుత్ కేంద్రం వద్ద ఇంటర్‌స్టేట్ మీటర్‌ను ఏర్పాటు చేశామని, దీనిద్వారా తెలంగాణ కు ఎంత విద్యుత్ సరఫరా జరుగుతుందో నమోదవుతుందని తెలిపారు. ఈ నమోదు ఆధారంగా ప్రస్తుతం తమ నుంచి వాడుకుంటున్న విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ  రాష్ట్రం నుంచి సొమ్ములు వసూలు చేసే అవకాశముందన్నారు. కాగా విలీన మండలాల్లో ఇప్పటికే విద్యుత్ సిబ్బందిని నియమించినట్లు రంపచోడవరం ఏడీఈ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యుత్ పంపిణీకి సంబంధించి విభజన ప్రక్రియ పూర్తికాగానే విలీన మండలాల్లో కూడా తమ సిబ్బందే బిల్లులు వసూలు చేస్తారని చెప్పారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ప్రాణం తీసిన బిందె

హెచ్‌ఐవీ ఉందని ఇంటికి పంపించేశారు

బీసీలను గుర్తించింది ఒక్క జగనే!

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

మహానేత స్ఫూర్తితో శ్రేయోదాయక బడ్జెట్‌

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

వైఎస్‌కు ఇచ్చిన వాగ్దానం మేరకే అనంతకు కియా

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

స్కెచ్చేశాడు.. చంపించాడు

రూ. కోటిన్నర లాభం కోసం.. రూ.53 కోట్లు పెట్టుబడి!

ప్రజాధనం ఆదా

‘క్రయోజనిక్‌’లో లీకేజీ వల్లే..

టీటీడీలో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వైవీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఒకటి అడిగితే సీఎం జగన్‌ రెండు చేస్తున్నారు..

రాష్ట్రంలో మూడు కొత్త స్టేడియాలు : అవంతి

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

‘అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై పునఃసమీక్ష’

తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి

శ్రీపూర్ణిమ‌ గ్రంథాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగ‌న్

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

‘వారికి పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్రానిదే’

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఏపీలో మావోయిస్టుల సమస్యలపై సబ్‌ కమిటీ

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

ఆర్‌ అండ్‌ ఆర్‌లో భారీ అక్రమాలు: జీవీఎల్‌

దాతల విస్మరణ.. మాజీల భజన..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం