విజయవాడలో డీజీపీ క్యాంప్ ఆఫీస్?

24 Jun, 2014 19:37 IST|Sakshi

విజయవాడ: త్వరలో విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) క్యాంప్ కార్యాలయం ప్రారంభం కానున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలోని రాష్ట్ర అతిథిగృహంలో సీఎం చంద్రబాబు అధికారిక కార్యకలాపాలు ప్రారంభించేలోగా డీజీపీ క్యాంప్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

మొదట గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకున్న సమయంలో మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో డీజీపీ క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేయాలనుకున్న విషయం విదితమే. అయితే సీఎం క్యాంప్ ఆఫీసు విజయవాడకు మారిననందున డీజీపీ ఆఫీసు కూడా బెజవాడకు మారే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు