కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో డీజీపీ అత్యవసర సమావేశం

8 May, 2019 12:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా సీపీ, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారలతో వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించి భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఇస్లామిక్‌, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతను పెంచాలని ఆదేశించారు. 

ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు. శ్రీలంకలో ఉగ్రదాడుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఎక్కడైనా భద్రతా లోపాలుంటే నెల రోజుల్లో సరిచేయాలని.. నెల రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.  మరోవైపు ఎన్నికల కౌటింగ్ పై కూడా జిల్లా ఎస్పీలతో డీజీపీ మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత.. కౌంటింగ్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు.

మరిన్ని వార్తలు