ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

5 May, 2017 15:07 IST|Sakshi
ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

అమరావతి:  ఏపీ ఎంసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఏపీ ఎంసెట్‌–2017 ఫలితాలను మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌ ప్రవేశపరీక్షలో లక్షా 23వేల 974మం‍ది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... తొలిసారిగా ఎంసెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించామని, దీని వల్ల పారదర్శకత ఉంటుందన్నారు. ఎక్కడా కూడా లీకేజీకి ఆస్కారం లేకుండా పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. ఏపీలో 124 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్‌ నిర్వహించినట్లు మంత్రి గంటా తెలిపారు. వచ్చే ఏడాది కూడా ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన వెల్లడించారు.  ఆ తర్వాత ఏడాది నుంచి ఎంసెట్‌ నిర్వహణ కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంజినీరింగ్‌లో టాప్‌ టెన్‌ ర్యాంక్‌ సాధించిన విద్యార్థులు

మొదటి ర్యాంక్‌:  వబిలివెట్టి మోహన్‌ అభ్యాస్‌(153.95 మార్కులు)
రెండో ర్యాంక్‌ : సాయి భరద్వాజ్‌
మూడో ర్యాంక్‌: ఆర్‌.సత్యం
నాలుగో ర్యాంక్‌ : జయంత్‌ హర్ష
అయిదో ర్యాంక్‌ : వెంకట షణ్ముఖ్‌ సాయి మౌనిక్‌
ఆరో ర్యాంక్‌ :  వెంకట నిఖిల్‌
ఏడో ర్యాంక్‌ :శశినాథన్‌
ఎనిమిదో ర్యాంక్‌ :వెంకట సాయి
తొమ్మిదో ర్యాంక్‌ : డి.వరుణ్‌ తేజ్‌
పదో ర్యాంక్‌ : కె.చిన్మయి సాయినాగేంద్ర

ఇక అగ్రికల్చరల్‌, మెడికల్‌ విభాగానికి సంబంధించి మొత్తం 55,288 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు.

మెడికల్‌, అగ్రికల్చరల్‌ విభాగంలో టాప్‌ టెన్‌ ర్యాంకర్స్‌  వివరాలు
మొదటి ర్యాంక్‌ : ఊటుకూరి వెంకట అనిరుధ్‌
రెండో ర్యాంక్‌ : దుర్గా సందీప్‌
మూడో ర్యాంక్‌ :  నున్న హిమజ
నాలుగో ర్యాంక్‌ : సాదినేని నిఖిల్‌ చౌదరి
అయిదో ర్యాంక్‌ : ఫణి శ్రీలాస్య
ఆరో ర్యాంక్‌ : మనోజ్‌ పవన్‌
ఏడో ర్యాంక్‌ : స్వాతికారెడ్డి
ఎనిమిదో ర్యాంక్‌ : కల్యాణ్‌
తొమ్మిదో ర‍్యాంక్‌ : సాయి శ్వేత
పదో ర్యాంక్‌ : అఖిల

ర్యాంకుల సమాచారాన్ని ఆయా అభ్యర్థుల ఫోన్‌ నంబర్లకు పంపించనున్నారు.  కాగా ప్రశ్నపత్రాల్లో వచ్చాన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ వేసిన  సంగతి విదితమే. దీనిపై ఆ కమిటీ అభిప్రాయం వ్యక్తపరుస్తూ పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఒక మార్కు కలిపే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఇతర ప్రశ్నలకు గాను థర్డ్‌ పార్టీ పరిశీలన అనంతరం తుది నిర్ణయం  ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. ఫలితాలను www.sakshi.comలో చూడవచ్చు.

మరిన్ని వార్తలు