మద్యం దుకాణాలు వర్థిల్లు గాక! రహదారులనే రద్దు చేస్తాం.

7 Jul, 2017 02:43 IST|Sakshi
మద్యం దుకాణాలు వర్థిల్లు గాక! రహదారులనే రద్దు చేస్తాం.

జాతీయ, రాష్ట్ర రహదారులను స్థానిక రహదారులుగా మార్పు: మంత్రి జవహర్‌
సాక్షి, అమరావతి: జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలుండడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని, జనం ఇబ్బం దులెదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు ఆందోళ న వ్యక్తం చేసింది. రోడ్డు పక్కనే మద్యం దొరుకుతుండడంతో డ్రైవర్లు అక్కడే సేవించి, వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగు తున్నాయంది.  అందుకే జాతీయ రహదారులకు 500 మీటర్లు, రాష్ట్ర రహదారు లకు 200 మీటర్ల లోపు ఎక్కడా మద్యం దుకాణాలు ఉండరాదని  అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభు త్వం సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తోంది. మద్యం దుకాణాలను జాతీయ, రాష్ట్ర రహదారులపై యథాతథంగా కొనసాగించ డానికి వీలుగా ఆయా రోడ్లనే రద్దు చేస్తామని చెబుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులను స్థానిక రహదారులుగా మార్చేస్తోంది.

 సాక్షా త్తూ రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఈ విషయం వెల్లడించడం గమనార్హం. సర్కారు నిర్ణయంతో రహదారుల పై నిత్యం మద్యం జాతర ఎప్పటì æలాగే కొనసాగనుంది. ఇప్పటికే జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నవారు ప్రధాన రహదారుల పైకి రావడానికి వీలుగా ప్రభుత్వం పలు వెసులుబాట్లు ప్రకటించింది. షిఫ్టింగ్‌ ఫీజుల ను ఎత్తివేస్తామంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు ఇచ్చేస్తామని ప్రకటిం చింది. జాతీయ రహదారులను డీనోటిఫై చేయడం ద్వారా మద్యం దుకాణాలను యథాతథంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్‌ శాఖ కేఎస్‌ జవహర్‌ తెలిపారు. ఇలా డీనోటిఫై చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, తాము ఎక్కడా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. మంత్రి జవహర్‌ గురువారం వెలగపూడి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్‌లు పొందిన వాళ్లు కూడా తిరిగి ప్రధాన రహదారులపైకి రానున్నట్లు వెల్లడించారు.

పారదర్శకంగా  షాపుల మంజూరు
మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జనావాసాల మధ్య లిక్కర్‌ షాపుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు 9951314101 నంబర్‌కు ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చని సూచించారు.   

5 రోజుల్లో రూ.120 కోట్ల నష్టం
జాతీయ రహదారులను డీనోటిఫై చేస్తూ అందాల్సిన ఉత్తర్వులు ఆలస్యం కావడంతో చాలామంది యజమానులు ఇంకా మద్యం షాపులు ప్రారంభించలేదని, దీనివల్ల ప్రభుత్వం ఐదు రోజుల్లో రూ.120 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు మంత్రి జవహర్‌ వెల్లడించారు.

ఎక్సైజ్‌ అధికారులపై సీఎం ఆగ్రహం
మద్యం దుకాణాలు పూర్తిగా తెరుచుకోక పోవడం వల్ల ఒకపక్క ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుం డడమే కాకుండా, జనావాసాల మధ్య షాపుల ఏర్పాటు పై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆందోళ నలు చేస్తుండడంతో ఎక్సైజ్‌ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి చాలా రోజులైనా దానికి అనుగుణంగా జూలై 1 కల్లా కొత్త షాపులను ప్రారంభించేలా చేయడంలో అధికారులు విఫలం కావడం పై ఆయన మండిపడినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు