హెచ్‌సీక్యూ మందుల అమ్మకాలపై ఆంక్షలు

23 Apr, 2020 13:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ నిరోధానికి ఉయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ (HCQ) అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని మందుల షాపుల్లో సాధారణ ప్రజలకు హెచ్‌సీక్యూ మందులను విక్రయించరాదని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర కోవిడ్‌-19 నోడల్‌ అధికారి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించిన వారు మాత్రమే హెచ్‌సీక్యూ విక్రయించాలని, ప్రిస్కిప్షన్‌ లేకుండా వీటిని విక్రయించరాదని పేర్కొన్నారు. ఈ మందులను వైద్యులు సూచించిన వారు, కోవిడ్‌-19 వైరస్‌ బారిన పడ్డవారు, ఇంట్లో వారి ద్వారా వ్యాప్తి చెందినవారు మాత్రమే వీటిని వినియోగించాలని, సాధారణ ప్రజలు వినియోగిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుందని పేర్కొంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు