ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌ హోదాలు రద్దు

3 Jun, 2019 18:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌ హోదాలను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయడంతో.. మే 25 నుంచి ప్రభుత్వ విప్‌ హోదాలు కోల్పోయినట్లు చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తొమ్మిది మంది సభ్యులు శాసన మండలిలో పదవులను కోల్పోయారు. వీరిలో పయ్యావుల కేశవ్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, బుద్దా వెంకన్న తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు