నవరత్నాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ

28 Nov, 2019 17:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నవరత్నాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌గా, మంత్రులు, అధికారులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు శామ్యూల్‌ను వైఎస్‌ చైర్మన్‌గా నియమించారు. డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పుష్ప శ్రీవాణి, ఆళ్లనాని, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్‌, శ్రీరంగనాథరాజ్‌, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు.

అలాగే 12 శాఖల ఉన్నతాధికారులను రాష్ట్ర స్థాయిలో సభ్యులుగా నియమించారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్‌ మంత్రుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. నవరత్నాలను సమర్థవంతగా అమలు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు