100 యూనిట్లు దాటితే వాతే!

2 Feb, 2015 17:09 IST|Sakshi
100 యూనిట్లు దాటితే వాతే!

హైదరాబాద్ :  విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రమంగా అడుగులు ముందుకు వేస్తోంది. దాదాపు అయిదు గంటలపాటు ఏపీ  కేబినెట్‌ సోమవారం సమావేశమైంది. విద్యుత్‌ ఛార్జీల పెంపు అంశంపై - మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. అయితే ఎప్పటి నుంచి పెంపు అమలు చేయాలన్నదానిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.  కాగా 100 యూనిట్ల పైనే విద్యుత్ ఛార్జీల పెంపుకు ప్రభుత్వం యోచిస్తోంది.

 మరోవైపు ఆదాయ వనరుల సమీకరణపై కూడా కేబినెట్‌ దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా కేబినెట్‌ భవనాల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్న రుణ ఉపశమన పథకంపై- ఇకపై జిల్లాల వారీగా సమీక్షలు చేయాలని నిర్ణయించారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఆధ్వర్యంలో ఈ సమీక్షలు చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. సోలార్‌ విద్యుత్‌ విధానానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు