కరోనా: వలంటీర్లకు రూ.50 లక్షల బీమా!

21 Apr, 2020 20:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలంటీర్లకు రూ.50 లక్షల భీమా సదుపాయం కల్పించేందుకు సిద్ధమైంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ రాజ్ శాఖకు మంగళవారం సర్క్యులర్‌ జారీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లకూ 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ' ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లకు  పీఎంజీకే ప్యాకేజీ కింద  రూ.50 లక్షల బీమా వర్తించనుంది. మూడు విడతల కొవిడ్-19 ఇంటింటి సర్వేలో పాల్గొన్న వలంటీర్లు పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ అయ్యే అవకాశమున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై వలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
(చదవండి: గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం)

మరిన్ని వార్తలు