ఇసుక రీచ్ ల వేలానికి రంగం సిద్ధం

16 Jan, 2016 12:41 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక రీచ్ వేలానికి రంగం సిద్ధమైంది. 3 దశల్లో ఇసుక రేవుల వేలం నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. క్యూబిక్ మీటరు రూ. 550 మించకుండా విక్రయించాలని నిర్ణయిచింది. రూ.550లోపు విక్రయానికి అంగీకరించిన వారే వేలంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడాది కాలానికి ఇసుక రేవుల వేలం నిర్వహించనున్నారు.
కాగా.. ఫిబ్రవరి 1నుంచి కొత్త ఇసుక విధానం అమలు కానుంది. ఈ- టెండర్ విధానం ద్వారా ఇసక రీచ్ లను వేలం వేయనున్నారు. జిల్లాలోనిజాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

 

>
మరిన్ని వార్తలు