ఏపీ ఐసెట్ షెడ్యూల్ విడుదల

3 Feb, 2016 09:50 IST|Sakshi

విశాఖపట్నం: డిగ్రీ విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఐసెట్-2016 షెడ్యూల్ విడుదల అయింది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎస్ఎన్ రాజు బుధవారం ఐసెట్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు.

ఏపీ ఐసెట్ - 2016 షెడ్యూలు వివరాలు:

  • ఈ నెల 6 నుంచి మార్చి 5 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
  • మార్చి 6 నుంచి 15 వరకు రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తులు
  • మార్చి 16 నుంచి 24 వరకు రూ.2000 అపరాధ రుసుము చెల్లించాలి
  • మార్చి 25 నుంచి 31 వరకు రూ.5000 అపరాధ రుసుముతో తుది గడువు ముగింపు
  • 15 ప్రాంతీయ కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహిస్తారు
  • మే 16న ఐసెట్ పరీక్ష
  • మే 19న ప్రాథమిక కీ విడుదల
  • మే 23 వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ
  • మే 27న ఐసెట్ ర్యాంకులు ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు