‘సీఎం జగన్‌ నిర్ణయంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు’

10 Jul, 2020 21:30 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : రాష్ట్రంలో కరోనా నివారణకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాన్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ప్రస్తుతం 3000 బెడ్స్ అందుబాటులో ఉంచామని, వాటిని 5000 వరకు పెంచుతున్నామన్నారు. ప్రతి జిల్లాకు కోటి రూపాయలు మంజూరు చేసి ల్యాబ్స్, ఎక్స్‌రే, టాయ్‌లెట్స్ నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. క్వారంటైన్ సెంటర్స్‌లో ఆహారం నాణ్యత పర్యవేక్షణకు ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని అదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. (టెక్స్​టైల్​ హబ్​గా ఆంధ్రప్రదేశ్)

గతంలో ఎన్నడూ లేని విధంగా క్వారంటైన్ సెంటర్‌లో ఒక వ్యకికి రోజుకు 500 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 75 కోవిడ్ సెంటర్లల్లో 5874 మంది చికిత్స పొందుతున్నారని, రాష్ట్రంలో 108, 104 అంబులెన్సు వాహనాలు ప్రవేశ పెట్టడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచి పనులపై చంద్రబాబు నాయుడు అసూయతో విమర్శలు చేస్తున్నాడని,  గత ప్రభుత్వంలో వైద్య రంగాన్ని పూర్తిగా బ్రష్టు పట్టించారని మంత్రి ఆళ్లనాని విమర్శించారు. (ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..)

మరిన్ని వార్తలు