పారిశ్రామిక రంగంలో రాష్ట్రానిది రెండో స్థానం

12 Sep, 2013 03:16 IST|Sakshi

రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి గీతారెడ్డి
 సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో ఉందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇగ్నైట్ పేరుతో హైదరాబాద్‌లో బుధవారం జరిగిన 21రోజుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రవుంలో గీతా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (నిమ్స్ మే)లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్ళ కిందట పరిశ్రమ రంగంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రం రెండోస్థానానికి ఎదగడం గర్వకారణమని, త్వరలోనే ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జె.డీ. శీలం మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో పలువురికి ఉద్యోగాలు కల్పించేస్థాయికి దళితులు ఎదగాలన్నారు. రాష్ట్ర మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద రావు, కొండ్రు మురళీ మోహన్, పసుపులేని బాలరాజు మాట్లాడారు.

మరిన్ని వార్తలు