అమరావతిలో అప్రమత్తం

23 May, 2019 14:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సచివాలయంలో అధికారులు అప్రమత్తమైయ్యారు. భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం సహా సచివాలయం నుంచి ఎలాంటి ఫైల్స్ బయటకు తరలించకుండా చూడాలని సెక్యురిటి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ బోర్డ్ సహా పలు శాఖల్లో కీలక ఫైల్స్ ధ్వంసం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన మద్దతుదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు వైఎస్‌ జగన్‌, చంద్రబాబు నివాసాల వద్ద భద్రతను పెంచారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు కేకే శర్మ అభినందించారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించారని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు