ఆహారధాన్యాల ఈ - పోస్ నమోదులో ఏపీ అగ్రస్థానం

5 Aug, 2015 13:49 IST|Sakshi

హనుమాన్‌జంక్షన్ : పౌరసరఫరాల శాఖ సేకరిస్తున్న మరియు పంపిణీ చేస్తున్న ఆహారధాన్యాల వివరాలను ఈ- పోస్ నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆర్ కరికల్ వలవెన్ తెలిపారు. హనుమాన్‌జంక్షన్ ఎఫ్‌సీఐలో ఈ-పోస్ విధానాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.

అనంతరం కరికల్ వలవన్ విలేకర్లతో మాట్లాడారు. ఆహారధాన్యాలకు సంబంధించి మొదటి నుంచి చివర వరకు సేకరణ, పంపిణీలను కంప్యూటరైజేషన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో ఈ-పోస్ విధానాన్ని పరిశీలించడానికి జిల్లా పర్యటనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

పౌరసరఫరాల శాఖ ధాన్యం మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి తరలించిన వివరాలు ఎఫ్‌సీఐ నుండి ఎంఎస్‌ఎల్ పాయింట్లకు పంపిణీ చేస్తున్న వివరాలతో పాటు నిల్వల వివరాలు ఈ-పోస్ నమోదు విధానం ఎలా జరుగుతోంది.. అన్న విషయాలు క్షేత్ర స్థాయి సిబ్బంది నుండి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. అనంతరం గిడ్డంగుల్లో ఆహారధాన్యాల నిల్వల విధానాన్ని, వాటి సంరక్షణ తీరుతెన్నులు కరికల్ వలవన్ పరిశీలించారు.

మరిన్ని వార్తలు