ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

4 Jul, 2013 04:48 IST|Sakshi

  - షెడ్యూల్ విడుదల
- మైదాన ప్రాంతంలో 640
- ఏజెన్సీ ప్రాంతంలో 501 పోస్టులు
- ఆగస్టు 25న ‘టెట్’
- అక్టోబర్ 9,10,11 తేదీల్లో పరీక్ష

ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. డీఎస్సీకి సంబంధించి షెడ్యూల్‌ను మంగళవారం రాత్రి విడుదల చేసింది. పరీక్షల నిర్వహణ మార్గదర్శకాలు, నోటిఫికేషన్ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ఈ ఏడాది టెట్, డీఎస్సీ కలిపి రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నా వేర్వేరుగా నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. టెట్ రాత పరీక్ష ఆగస్టు 25న జరగనుంది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డీఎస్సీ రాత పరీక్ష అక్టోబర్ 9,10,11 తేదీల్లో జరగనుంది. దరఖాస్తులను ఆగస్టు 1 నుంచి 30 వరకు ‘ఆన్‌లైన్’లో స్వీకరించనున్నారు.

తీరనున్న ఉపాధ్యాయుల కొరత
జిల్లాలో ఎస్జీటీ పోస్టులు అధికంగా భర్తీ కానున్నాయి. 983 ఎస్జీటీ, 93 స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ), 60 భాషా పండిత్, 5 పీఈటీ పోస్టులు కలిపి 1,141 పోస్టులు భర్తీ చేయనున్నారు. మే నెల వరకు ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకొని భర్తీ చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో 367 పోస్టులు ఖాళీ ఉండగా ఫిబ్రవరి నెలలో 375 పోస్టులు అదనంగా ప్రభుత్వం మంజూరు చేయగా వీటిలో 640 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 401 పోస్టులు ఖాళీ ఉండగా ప్రభుత్వం 196 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 501 పోస్టులకు షెడ్యూల్ విడుదల చేసింది. మైదాన ప్రాంతాల్లో 641 పోస్టులు, ఏజెన్సీ ప్రాంతంలో 501 పోస్టులు ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

మైదాన ప్రాంతంలో భర్తీ అయ్యే పోస్టులు..
తెలుగు మీడియం : గణితం 2, ఫిజికల్ సైన్స్ 3, బయోసైన్స్ 5, సాంఘిక శాస్త్రం 7, ఆంగ్లం 5, స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 5, హిందీ 2, భాషా పండిత తెలుగు 12, బాషా పండిత్ హిందీ 1, ఎస్జీటీ 440, పీఈటీ 3 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఉర్దూ మీడియం : ఎస్‌ఏ గణి తం ఉర్దూ 5, ఫిజికల్ సైన్స్ 9, బయోసైన్స్ 3, సాంఘిక శాస్త్రం 4, ఎస్‌ఏ (ఉర్దూ) 1, భాషా పండిత్ (ఉర్దూ) 3, ఎస్జీటీ (ఉర్దూ) 81 పోస్టులు భర్తీ చేయనున్నారు.
మరాఠీ మీడియం : ఎస్‌ఏ (గణితం) 2, ఫిజికల్ సైన్స్ 2, బయోసైన్స్ 2, సాంఘిక శాస్త్రం 1, ఎస్‌ఏ (మరాఠీ) 1, భాషా పండిత్ (మరాఠీ) 3, పీఈటీ 1, ఎస్జీటీ 26 పోస్టులు భర్తీ చేయనున్నారు.

హిందీ మీడియం : పీఈటీ 1, ఎస్జీటీ 10 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఏజెన్సీ ప్రాంతం..
తెలుగు మీడియం : ఎస్‌ఏ (గణితం) 5, ఫిజికల్ సైన్స్ 1, బయోసైన్స్ 3, సాంఘిక శాస్త్రం 4, ఆంగ్లం 4, తెలుగు 2, హిందీ 1, భాషా పండిత్ (తెలుగు) 32, భాషా పండిత్ (హిందీ) 6, ఎస్జీటీ 345 పోస్టులు భర్తీ చేస్తారు.

ఉర్దూ మీడియం : ఎస్‌ఏ గణితం 1, ఫిజికల్ సైన్స్ 1, ఎస్‌ఏ ఉర్దూ 1, ఎస్జీటీ 45.
మరాఠీ మీడియం : ఎస్‌ఏ గణితం 2, ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్ 1, సాంఘిక శాస్త్రం 1, భాషా పండిత్ మరాఠీ 3, ఎస్జీటీ 11.
బెంగాలి మీడియం : ఎస్జీటీ ఏజెన్సీ 25.
హిందీ మీడియం : ఎస్‌ఏ (గణితం) 1, ఫిజికల్ సైన్స్ 3, బయోసైన్స్ 1, సాంఘిక శాస్త్రం 2 పోస్టులు భర్తీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు