పీపీఏల పాపమే!

5 May, 2020 09:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్‌ విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు డిస్కమ్‌లకు శాపంగా మారాయి. మార్కెట్లో కారుచౌకగా విద్యుత్‌ లభిస్తున్నా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవటానికి ఐదేళ్ల క్రితం చేసుకున్న కొనుగోలు ఒప్పందాలే కారణం. దీనివల్ల విద్యుత్‌ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. లాక్‌డౌన్‌తో ఒకవైపు విద్యుత్‌కు డిమాండ్‌ తగ్గిపోగా మరోవైపు రెవెన్యూ వసూళ్లు నిలిచిపోయాయి. 2019–20 విద్యుత్‌ కొనుగోలు వివరాలను ఏపీ విద్యుత్‌ సంస్థలు సోమవారం మీడియాకు వెల్లడించాయి. (నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

 2019–20లో మార్కెట్లో విద్యుత్‌ సగటు ధర యూనిట్‌ రూ. 4 మాత్రమే ఉండగా ఏపీ డిస్కమ్‌లు అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి  కొనుగోలు చేశాయి. పీపీఏలే దీనికి కారణం.
 2019 ఏప్రిల్‌ నుంచి 2020 ఏప్రిల్‌ వరకు రాష్ట్రంలో ఏడాదికి 70,747 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లభ్యత ఉండగా వినియోగించింది 64,128 మిలియన్‌ యూనిట్లు. ఇందులో అధిక భాగం దీర్ఘకాలిక పీపీఏలే ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో సోలార్‌ విద్యుత్తు ధర యూనిట్‌ రూ.2 లోపు ఉంటే పీపీఏలున్న సంస్థల నుంచి రూ. 4.80 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది.
రాష్ట్రంలో జల విద్యుత్‌ యూనిట్‌ రూ.2.69 మాత్రమే ఉన్నా పీపీఏల వల్ల ఏటా 3,518 మిలియన్‌ యూనిట్లకే పరిమితం అవుతోంది.
ఐదేళ్లుగా ఏపీజెన్‌కో ధర్మల్‌ ప్లాంట్లలో ఉత్పత్తి భారీగా తగ్గించడంతో అప్పులు వెంటాడుతున్నాయి. వీటికోసం చేసిన రుణాల వల్ల విద్యుత్‌ ధరలు మార్కెట్‌ రేటుకన్నా ఎక్కువగా ఉన్నాయి.   
కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ వాటా మార్కెట్‌ కన్నా ఎక్కువగా ఉంది. యూనిట్‌ రూ. 4.64 వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీర్ఘకాలిక పీపీఏలు లేకుంటే ఈ విద్యుత్‌కు బదులు మార్కెట్‌లో తక్కువకు తీసుకునే వీలుంది.  

పీపీఏల వల్లే ఇబ్బందులు  
‘దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి పెరగడంతో మార్కెట్లో చౌకగా లభిస్తోంది. కానీ ఏపీ డిస్కమ్‌లు గతంలో దీర్ఘకాలిక పీపీఏలు కుదుర్చుకోవడంతో చౌకగా లభించే విద్యుత్‌ను పూర్తిస్థాయిలో తీసుకోలేకపోతున్నాయి. ఇది డిస్కమ్‌లను ఆర్థికంగా దెబ్బ తీస్తోంది’  
– శ్రీకాంత్‌ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా