మన పోలీసులకు మహా పని గంటలు

8 Sep, 2019 08:49 IST|Sakshi

16 గంటల పనితో ఏపీ పోలీసులకు దేశంలో మూడో స్థానం

వీక్లీ ఆఫ్‌ అమలుతో కొత్త అధ్యాయం 

సాక్షి, అమరావతి: షిఫ్ట్‌లు.. 8 గంటల పని వేళతో సంబంధం లేకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతుంటారు పోలీసులు. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు రోజుకు పది గంటల పైనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్క నాగాలాండ్‌లో మాత్రమే రోజుకు 8 గంటలు పనిచేస్తుంటే.. ఒడిశాలో ఏకంగా 18 గంటల పాటు విధుల్లోనే ఉంటున్నారు. ఒడిశా తరువాత 17 గంటలపాటు పనిచేస్తున్న పంజాబ్‌ పోలీసులు రెండో స్థానంలో ఉంటే.. రోజుకు 16 గంటల పనితో ఏపీ పోలీసులు మహా పనిమంతులుగా నిలుస్తున్నారు. తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల పోలీసులు సైతం 16 గంటలపాటు విధుల్లో ఉంటున్నారు. మూడు రాష్ట్రాల పోలీసులు 14 గంటలు, రెండు రాష్ట్రాల్లో 13 గంటలు, మూడు రాష్ట్రాల్లో 12 గంటలు, రెండు రాష్ట్రాల్లో 11 గంటలపాటు పోలీసులు పని చేస్తున్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి.  

వీక్లీ ఆఫ్‌తో ఊరట 
తాను అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ మాట నిలబెట్టుకోవడంతో ఏపీ పోలీసులకు ఊరట లభించింది. ఈ ఏడాది జూన్‌ నుంచి అమల్లోకి వచ్చిన వీక్లీ ఆఫ్‌ విధానం కానిస్టేబుల్‌ స్థాయినుంచి అధికారుల వరకు వర్తించేలా చర్యలు  చేపట్టారు. దీంతో సరిపెట్టకుండా సీఎం ఆదేశాలతో పోలీసులకు ఆరోగ్య భద్రత, వారి కుటుంబాల సంక్షేమం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఏపీ పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపినట్టైంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఛీ’ప్‌ ట్రిక్స్‌    

వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

‘సచివాలయ’ పరీక్షలు.. తప్పు ప్రశ్నలకు మార్కులు

కుటుంబరావు ఖాతాలో రూ.200 కోట్లు

ఇంటి వద్దకే బియ్యం

యురేనియం కాలుష్యానికి ముకుతాడు

‘ఒకే ఒక్కడి’పై ఎందుకంత అక్కసు!

పరిటాల కుటుంబంతో ప్రాణహాని

అనంతపురం తాజ్‌మహల్‌

కిలిమంజారో ఎక్కేశాడు

భర్తకు తెలియకుండా గర్భం.. దీంతో భయపడి..

నిండు కుండల్లా..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

భూకబ్జాలపై కొరడా

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

‘బియ్యం బాగున్నాయంటూ ప్రశంసలు’

‘ఆ కేసులపై పునర్విచారణ చేయిస్తాం’

ఈనాటి ముఖ్యాంశాలు

'జగన్‌ ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తున్నారు'

ఇది చంద్రబాబు కడుపు మంట

‘మతి భ్రమించే చంద్రబాబు అలా చేస్తున్నారు’

పచ్చ నేత చెరవీడిన తెలుగు గంగ స్థలం

నవరాత్రుల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి

ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్‌ గణపతి దర్శనం ఎలా?

అక్కసుతో రాజకీయాలు చేయొద్దు..

అమరావతికి అడ్రస్‌ లేకుండా చేశారు: బొత్స

‘మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి ’

సీఎం జగన్‌తో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

నయా లుక్‌