'లాజిస్టిక్ హబ్గా ఏపీని తీర్చిదిద్దుతాం'

3 Apr, 2015 16:23 IST|Sakshi
'లాజిస్టిక్ హబ్గా ఏపీని తీర్చిదిద్దుతాం'

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ పెట్టుబడులకు అన్ని విధాలుగా అనుకూలమని తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీసిటీలోని పెప్సీ పరిశ్రమను సంస్థ సీఈవో ఇంద్రానూయితో కలిసి ఆయన ప్రారంభించారు. 

9 పారిశ్రామిక యూనిట్లకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక అనుమతులకు సింగిల్ విండో విధానం అమలులోకి తేనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోరత లేదని అన్నారు.  అదేవిధంగా ప్రపంచంలోనే భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు