ఏపీ టూరిజం ఎక్సలెన్స్‌ అవార్డులు ప్రదానం

28 Sep, 2019 21:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తమది అవినీతి రహితంగా పనిచేసే ప్రభుత్వమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేసే వ్యక్తి అని.. ప్రచారం చేసే వ్యక్తి కాదని అన్నారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 3 నెలలుగా ఎలాంటి మరక లేకుండా పనిచేస్తున్నామన్నారు.  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఉద్దేశం మాకు లేదన్నారు. ప్రజలు నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. ‘ఆదాయం ఎంత ముఖ్యమో పర్యాటకుల భద్రత కూడా అంతే ముఖ్యం. కేరళ జీడీపీలో 11 శాతం పర్యటకానిదే. పర్యాటకుల కోసం అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు తీసుకోస్తాం’ అని అన్నారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పర్యాటక శాఖ సీఈవో ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఏపీ టూరిజం ఎక్సలెన్ సీ అవార్డ్స్ -2019ను మంత్రులు అందించారు.

ఉత్తమ 5 స్టార్ హోటల్ గా విశాఖ నోవోటెల్ కు పురస్కారం
ఉత్తమ 5స్టార్ హోటల్ ( క్లాసిఫైడ్) గా విజయవాడ గేట్ వే
ఉత్తమ 4 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)గా విశాఖ పామ్ బీచ్ హోటల్
ఉత్తమ 3 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)గా హోటల్ బ్లీస్ 
ఉత్తమ పర్యావరణ హిత హోటల్ గా పల్లవి రిసార్ట్స్, పాలకొల్లు
మోస్ట్ ఇన్నోవేటీవ్ ఇన్ బౌండ్ టూర్ ఆపరేటర్ అవార్డు సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్‌ లిమిటెడ్

మరిన్ని వార్తలు