ఏపీ జిల్లా పరిషత్‌ రిజర్వేషన్లు ఖరారు

6 Mar, 2020 15:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్ధల ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 సెక్షన్‌ 181, సబ్‌ సెక్షన్‌ 2 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు గాను మహిళలకు ఏడు స్థానాలు (రెండు బీసీ) రిజర్వు కాగా, నాలుగు స్థానాలు జనరల్‌, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానం చొప్పున రిజర్వు చేయబడ్డాయి.

జిల్లాల వారిగా  రిజర్వేషన్లు...

1 ) అనంతపురం : బీసీ మహిళ
2) చిత్తూరు : జనరల్‌
3) తూర్పుగోదావరి : ఎస్సీ
4) గుంటూరు : ఎస్సీ మహిళ
5) కృష్ణా : జనరల్‌  మహిళ
6) కర్నూలు : జనరల్‌
7) ప్రకాశం : జనరల్‌ మహిళ
8) నెల్లూరు : జనరల్‌ మహిళ
9) శ్రీకాకుళం : బీసీ మహిళ
10) విశాఖపట్నం : ఎస్టీ మహిళ
11) విజయనగరం : జనరల్‌
12: పశ్చిమ గోదావరి : బీసీ
13) కడప : జనరల్‌


 

మరిన్ని వార్తలు