అభ్యంతరాల వల్లే ఆ పోస్టును హోల్డ్‌లో పెట్టాం

6 Jun, 2018 13:34 IST|Sakshi
నాగేశ్వరరావు

వ్యవసాయ మంత్రిత్వశాఖతో మళ్లీ సంప్రదింపులు చేస్తాం

త్వరలో పుల్లారావుకు ఉత్తర్వులిచ్చేలా చర్యలు తీసుకుంటాం

ఏయూ వీసీ నాగేశ్వరరావు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వ్యవసాయ ఆర్థిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌ ఉండగా గౌరవ సంచాలకుల అవసరం ఏముందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఆచార్య పుల్లారావు నియామకంలో అడ్డంకి ఏర్పడిందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు వెల్లడించారు.  పుల్లారావును నియమిస్తూ వీసీ ఉత్తర్వులిచ్చి నెలన్నర దాటినా ఇంకా రిజిస్ట్రార్‌ నుంచి సంబంధిత శాఖకు నియామకపు ఆదేశాలు రాకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంపై ‘వీసీయా ఐతే ఏంటి’ శీర్షికన మంగళవారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ఏయూ వర్గాల్లో కలకలం రేపింది.

దీనిపై వీసీ నాగేశ్వరరావు మంగళవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అభ్యంతరాల నేపథ్యంలోనే ఉత్తర్వుల అమలులో జాప్యం జరిగిందే కానీ... తనకు, రిజిస్ట్రార్‌కు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఎన్నో దశాబ్దాలుగా ఆగ్రో ఎకనామిక్‌ సెంటర్‌కు గౌరవ సంచాలకులుగా అర్థశాస్త్ర విభాగాధిపతి వ్యవహరించడం ఆనవాయితీగా వస్తున్న మాట నిజమేనన్నారు. ఇదే విషయాన్ని మంత్రిత్వశాఖ ప్రతినిధులకు, యూజీసీ ప్రతినిధులకు వివరించి పుల్లారావుకు గౌరవ సంచాలకుల పోస్టు వచ్చేలా త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు