అనస్థీషియా వైద్యమే కీలకం: డాక్టర్ చక్రరావు

26 Oct, 2013 04:06 IST|Sakshi

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:  ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:  వైద్యరంగంలో అనస్థీషియా వైద్యం చాలా కీలకమైందని, విప్లవాత్మకంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దానిని వినియోగించుకోవాలని ఇండియన్ అనస్థీషియా సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ చక్రరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో మూడు రోజుల పాటు జరుగనున్న రాష్ర్టస్థాయి అనస్థీషియా వైద్యుల (ఐఎస్‌ఏ ఏపికాన్ 2013) సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో చక్రరావు మాట్లాడుతూ రోజురోజుకు వస్తున్న మార్పులను వైద్యులకు తెలియజేసేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతినిదులు నూతన వైద్య విధానాన్ని తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఏ చిన్న సర్జరీ చేయాలన్నా అనస్థీషియా ముఖ్యమని, ముందుముందు ఈ వైద్యం ప్రధాన భూమిక అవుతుందని అన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్‌సింగ్, డాక్లర్లు బి దామోదర్‌రావు, రాజగోపాల్‌రావు, మమత ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, కిరణ్‌కుమార్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బాగం కిషన్‌రావు, బండారుపల్లి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మమత వైద్య కళాశాల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి జానిమియా, ప్రసాద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. అనస్థీషియాలో వచ్చిన అనేక నూతన మార్పులపై శని, ఆదివారాల్లో జరుగనున్న కార్యక్రమాల్లో బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చిన డాక్టర్లు వివరించనున్నారు.   
 
 రోగికి నొప్పిలేకుండా  వైద్యం అందించడమే లక్ష్యం
 ఖమ్మం అర్బన్: రోగికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మత్తు (అనస్థీషియా) ఇంజక్షన్ కీలకమని, నూతన వైద్యం విధానంలో మత్తు వైద్యం అందించే విధానంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వైద్యులను తీర్చిదిద్దుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌సీ చక్రరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో జరుగనున్న అనస్థీషియా రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనేం దుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.  దేశంలో 20వేల మంది అనస్థీషియాలజిస్ట్‌లు ఉన్నారని, వైద్యరంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులపై వారికి అవగాహన కల్పిం చేందుకు ప్రతీ ఏడాది సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనస్థీషియా వైద్యం పై ప్రతీ ఏడాది నాలుగు రోజుల పాటు దేశస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ సారి డిసెంబర్ 25 నుంచి 29 వరకు గౌహతిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలి పారు.  ఈ సమావేశంలో ఇండియన్ అనస్థీషియా అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ దయాల్‌సింగ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్‌రావు, కార్యదర్శి వి.రాజగోపాల్, కిరణ్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ భాగం కిషన్‌రావు పాల్గొన్నారు.

ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో మూడు రోజుల పాటు జరుగనున్న రాష్ర్టస్థాయి అనస్థీషియా వైద్యుల (ఐఎస్‌ఏ ఏపికాన్ 2013) సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో చక్రరావు మాట్లాడుతూ రోజురోజుకు వస్తున్న మార్పులను వైద్యులకు తెలియజేసేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతినిదులు నూతన వైద్య విధానాన్ని తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఏ చిన్న సర్జరీ చేయాలన్నా అనస్థీషియా ముఖ్యమని, ముందుముందు ఈ వైద్యం ప్రధాన భూమిక అవుతుందని అన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్‌సింగ్, డాక్లర్లు బి దామోదర్‌రావు, రాజగోపాల్‌రావు, మమత ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, కిరణ్‌కుమార్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బాగం కిషన్‌రావు, బండారుపల్లి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మమత వైద్య కళాశాల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి జానిమియా, ప్రసాద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. అనస్థీషియాలో వచ్చిన అనేక నూతన మార్పులపై శని, ఆదివారాల్లో జరుగనున్న కార్యక్రమాల్లో బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చిన డాక్టర్లు వివరించనున్నారు.   
 
 రోగికి నొప్పిలేకుండా  వైద్యం అందించడమే లక్ష్యం
 ఖమ్మం అర్బన్: రోగికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మత్తు (అనస్థీషియా) ఇంజక్షన్ కీలకమని, నూతన వైద్యం విధానంలో మత్తు వైద్యం అందించే విధానంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వైద్యులను తీర్చిదిద్దుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌సీ చక్రరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో జరుగనున్న అనస్థీషియా రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనేం దుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.  దేశంలో 20వేల మంది అనస్థీషియాలజిస్ట్‌లు ఉన్నారని, వైద్యరంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులపై వారికి అవగాహన కల్పిం చేందుకు ప్రతీ ఏడాది సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనస్థీషియా వైద్యం పై ప్రతీ ఏడాది నాలుగు రోజుల పాటు దేశస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ సారి డిసెంబర్ 25 నుంచి 29 వరకు గౌహతిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలి పారు.  ఈ సమావేశంలో ఇండియన్ అనస్థీషియా అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ దయాల్‌సింగ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్‌రావు, కార్యదర్శి వి.రాజగోపాల్, కిరణ్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ భాగం కిషన్‌రావు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు