నిందలు మోపి తొలగిస్తున్నారు..

23 Oct, 2018 08:23 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వద్ద గోడువెళ్లబోసుకున్న అంగన్‌వాడీ సిబ్బంది

విజయనగరం, ప్రజా సంకల్పయాత్ర బృందం: టీడీపీ పాలకులు తమకు నచ్చినవారికి పోస్టింగ్‌లు కట్టబెట్టేందుకు మాపై లేనిపోని నిందలు మోపి తొలగిస్తున్నారని రామభద్రపురం, సాలూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లకు చెందిన పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపించారు. రామభద్రపురం మండలం జన్నివలస క్రాస్‌ వద్ద ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ సిబ్బంది అవస్థలు పడుతున్నారన్నారు. ప్రతి పనిలోనూ తమ ను ఉపయోగించుకుని వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదని వాపోయారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎటువంటి బెనిí œట్స్‌ కల్పించలేదని చెప్పారు. ఐఎస్‌ఎల్, పల్స్‌పోలియో, గ్రామదర్శిని, ఇమ్యునైజేషన్, గ్రామసదస్సు ఇలా అన్ని ప్రభుత్వ పథకాల్లో మా సేవలు పొంది మాపైనే విజిలెన్స్‌ దాడులు చేయిస్తున్నారని జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచాలని కోరారు. సమస్యలు సావధానంగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పం దించడంతో అంగన్‌వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు