ఆలీ బాబా 40 దొంగల్లాగా.. ఆలీ బాబు..

17 Jun, 2019 11:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : నీటి బొట్టులేకుండా.. నీడ చెట్టు లేకుండా.. నీరు చెట్టులో రూ. 18 వేల కోట్లు దోచేసిన ఘన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిదని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైఫ్‌లైన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ. 16వేల కోట్ల నుంచి రూ.56 వేల కోట్లకు పెంచేసిన ఘనత టీడీపీది కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నారన్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో 500 కోట్ల రూపాయలు తినేశారని మండిపడ్డారు. ఆలీ బాబా 40 దొంగల్లాగా.. ఆలీ బాబు చోర్‌ అని 23 మంది వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నారు కాబట్టే.. ఆలీ బాబు గారికి 23(ఎమ్మెల్యేలను) మందినే భగవంతుడు ఇచ్చాడని ఎద్దేవా చేశారు.

ఆ ఘనత వైఎస్సార్‌దే
పోలవరానికి 24 పర్మీషన్లు అవసరమైతే 23 పర్మీషన్లను తీసుకొచ్చిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు పోలవరం ప్రాజెక్టు కొనసాగడానికి కారణం కూడా వైఎస్సారేనని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ఏమీ మారలేదని, ఇప్పటికైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. గుంటూరు హాస్పిటల్‌లో ఓ బాలుడు ఎలుకలు కొరికి చనిపోతే ఆ ఎలుకలను పట్టుకోవటానికి ఒక్కో ఎలుకకు లక్షల రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అన్నారు. 300 ఎలుకలను పట్టుకోవటానికి దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారంటూ మండిపడ్డారు. పోలవరాన్ని సోమవారంగా మార్చి ప్రతి సోమవారం ఓ ఇటుక పేర్చుతూ జాతికి అంకితమివ్వటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల

నిధులు చాలక..నత్తనడక

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు

7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌

సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం

దివిసీమలో గాలివాన బీభత్సం

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !

పెన్సిల్‌ ముల్లుపై షిర్డీసాయిబాబా 

గురుభ్యోనమః

ఉపాధ్యాయుడి పైశాచికత్వం

అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం

డ్రైఫ్రూట్‌ కిళ్లీ@ చీరాల

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

సింహగిరి.. భక్తఝరి

‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు

టీడీపీ ప్రభుత్వం నిండా ముంచింది..

ఎవరైనా బీజేపీలో చేరొచ్చు

ఆహాఏమిరుచి..అనరామైమరచి

గ్రామ సచివాలయ ఉద్యోగాలోచ్‌..!

కర్కశత్వానికి చిన్నారుల బలి

జీతాలు ఎగ్గొట్టిన టీడీపీ

విశాఖలో టీడీపీ పంచాయితీ

తిన్నది.. కరిగిద్దామిలా..!

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

బంధాన్ని మరిచి..ఇంటిని విడిచి...

అర్ధరాత్రి కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

సీఎం జగన్‌ స్పందనతో అక్రమాల పుట్ట కదులుతోంది

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం