వైఎస్‌ జగన్‌కు నీరాజనం పడుతున్న ప్రజలు

26 Sep, 2018 14:22 IST|Sakshi
నవరత్నాల పథకాలపై మహిళలకు వివరిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌

నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌   

నెల్లూరు(మినీబైపాస్‌): ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నగరంలోని 49వ డివిజన్‌ పరిధిలోని పొర్లుకట్ట ప్రాంతంలో డివిజన్‌ ఇన్‌చార్జి వందవాసి రంగా ఆధ్వర్యంలో నిర్వహించిన రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్‌ ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ కోరుకుంటుండటం సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రాజన్న రాజ్యాన్ని తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా చూస్తామన్నారు.

చోద్యం చూస్తోన్న మంత్రి నారాయణ
కార్పొరేషన్‌ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఎక్కడి చెత్త అక్కడే ఉందని, కాలువలు నిండిపోయి రోడ్లపై మురుగునీరు వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మంత్రి నారాయణ చోద్యం చూస్తున్నారని ఎమ్మెల్యే అనిల్‌ పేర్కొన్నారు. ఒక రోజంతా మంత్రి నారాయణ స్వయంగా నగరంలో రోడ్డుమీద తిరిగితే ప్రజలు పడుతున్న బాధలు ఎలా ఉంటాయే తెలుస్తుందన్నారు. జీఓ 279 తమకొద్దని పారిశుద్ధ్య కార్మికులు పోరాటం చేస్తుంటే, జీఓ 279 అంటే కార్మికులకు తెలియదని మంత్రి హేళన చేయడం తగదన్నారు. ఇప్పటికైనా జీఓ 279 రద్దుచేసి, కార్మికులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నాయకులు వందవాసి రంగా, కుంచాల శ్రీనివాసులు, విద్యాసాగర్, మల్లెబోయిన ప్రభాకర్, ప్రవీణ్, శీను, వెంకటేష్, శివపురం సురేష్, హంజాహుస్సేనీ, ఎస్‌ఆర్‌.ఇంతియాజ్, ఎస్‌కె.మున్నా. ఎం.జయకృష్ణారెడ్డి, జావీద్‌ పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు