ఇళ్ల నిర్మాణంలో భారీ దోపిడీ

5 Apr, 2018 11:14 IST|Sakshi
ఇందిరాభవన్‌లో కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌

నెల్లూరు రూరల్‌: నగరంలోని జనార్దన్‌రెడ్డి కాలనీలో హౌస్‌ ఫర్‌ ఆల్‌ ఇళ్ల నిర్మాణంలో ఒక చదరపు అడుగును రూ.1900కు చేపట్టడంతో ప్రజలకు భారంగా మారిందని, తాను చదరపు అడుగును రూ.1300కే నిర్మిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, నిర్మిస్తే మంత్రి నారాయణ రాజకీయాల నుంచి తప్పుకొంటారానని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రశ్నించారు. హౌస్‌ ఫర్‌ ఆల్‌ నిర్మాణంలో జరుగుతున్న దోపిడీపై ఎమ్మెల్యే అనిల్‌ బుధవారం అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి వివరించారు. బాలాజీనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయానికి వెళ్లి సీపీఎం నేతలతో చర్చించారు. అనంతరం ఇందిరాభవన్‌లో కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఒక చదరపు అడుగు ఈ రేటు లేదని, నెల్లూరు నగరంలో ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారో అర్థం కావ డం లేదన్నారు.

నగరం, రాష్ట్రంలో గా నీ, చివరికి నారాయణ సంస్థల్లో గానీ షేర్‌వాల్‌ టెక్నాలజీని ఉపయోగించలేదని, హౌస్‌ ఫర్‌ ఆల్‌ నిర్మాణంలో ఎందుకు ఉపయోగించారని ప్రశ్నిం చారు. షేర్‌వాల్‌ టెక్నాలజీతో కాకుం డా అపార్ట్‌మెంట్‌ పద్ధతిలో ఇళ్లను నిర్మించినా ఒక్కో ఇంటికి అడుగు రూ.600 మిగిలేదన్నారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతను తనకు అప్పగిస్తే నాణ్యతతో చదరపు అడుగును రూ.1300కే ఏడాదిలోపు నిర్మించి చూపిస్తానని చెప్పారు. హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకంలో దోపిడీ జరుగుతోందని చర్చకు రమ్మ ంటే.. దాని గురించి మాట్లాడకుండా వైఎస్సార్‌నగర్‌లోని ఇళ్లు, రాజీవ్‌ స్వ గృహ ఇళ్ల నాణ్యతపై మాట్లాడుతున్నారని చెప్పారు. అప్పటి నగర, రూరల్‌ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం జరిగిందని, ప్రస్తుతం వారు టీడీపీలోనే ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ప్రశ్నించారు.

అప్పుడు ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు, ఇటుక రాళ్లను సరఫరా చేసిన వారు మీ పక్కనే ఉన్నారని, వారిని వదిలేసి ఆ నిందలను తమపై వేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ పార్టీ నగరాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు, కార్పొరేటర్లు ఓబిలి రవి చంద్ర, ఊటుకూరు మాధవయ్య, గో గుల నాగరాజు, ఖలీల్‌ అహ్మద్, నాయకులు కర్తం ప్రతాప్‌రెడ్డి, వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, దార్ల వెంకటేశ్వర్లు, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ముదిరెడ్డి లక్ష్మీరెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, రఘు, రవి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు