‘సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం’

12 Nov, 2019 19:10 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వీవోఏ, సంఘమిత్ర, మెప్మా సిబ్బంది తెలిపారు. ఏపీ ప్రభుత్వం వారి జీతాలు మూడు వేల నుంచి 10 వేలకు పెంచడంతో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మాట్లాడుతూ..ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప నేత వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. అనంతరం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన వేలాది మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి: ఏపీ ప్రభుత్వం వీవోఏ,ఆర్‌పీలకు గౌరవ వేతనాన్ని పదివేలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జంగారెడ్డి గూడెం మసీదు సెంటర్‌లో ఎమ్మెల్యే ఎలీజా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎలీజా  మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను వైఎస్‌ జగన్‌  చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని తెలిపారు.  ఆరు నెలల్లో ఏ ముఖ్యమంత్రి  చేయని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కనీస వేతనాలు పెంచాలని ఆర్‌పీలు, వీవోఏలు  ధర్నాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్‌ జగన్‌ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా:  తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం పట్ల కైకలూరు నియోజకవర్గ బుక్‌ కీపర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు,  వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా: సీఎం వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు శృంగవరపుకోట వీవోఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటివరుకు చాలీ చాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 10 వేలు వేతనాన్ని పెంచిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఎంతో రుణపడి ఉంటామన్నారు. దేవి కూడలిలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వీవోఏలు పూలమాలలు వేశారు.

తూర్పుగోదావరి: సీఎం వైఎస్‌ జగన్‌ పదివేలు గౌరవ వేతనం ప్రకటించడంపై యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం జగన్‌ చిత్రపటానికి  మెప్మా, ఆర్‌పీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.

మరిన్ని వార్తలు