ఆత్మహత్యాయత్నం కేసులో రామచంద్రయ్య అరెస్ట్

15 Feb, 2016 20:18 IST|Sakshi

ఆత్మహత్యాయత్నం కేసులో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్యను అలిపిరి సీఐ శ్రీనివాసులు సోమవారం అరెస్టు చేశారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ అన్నా రామచంద్రయ్య నిరాహార దీక్ష చేపట్టగా నాలుగో రోజున పోలీసులు దీక్షను అడ్డుకున్నారు.

 

అనంతరం ఆయన్ని చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. కాగా, ఈ సందర్భంగా రామచంద్రయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన్ని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

 

మరిన్ని వార్తలు