నల్లకాల్వకు చేరిన ఎమ్మెల్యే పాదయాత్ర

6 Sep, 2019 08:14 IST|Sakshi
చిన్నకంభం వద్ద ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతున్న అభిమానులు, కార్యకర్తలు

సాక్షి, కంభం (ప్రకాశం): గిద్దలూరు ఎమ్మెల్యే అన్నావెంకట రాంబాబు తిరుమల పాదయాత్ర రెండో రోజు కంభం మండలం చిన్నకంభం గ్రామానికి చేరింది. చిన్నకంభం గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. పోరుమామిళ్ళపల్లి, చిన్నకంభం, దేవనగరం, జెబికె పురం గ్రామాల మీదుగా నల్లకాల్వ గ్రామం వరకు పాదయాత్ర సాగింది. చిన్నకంభం గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు యేలం వెంకటేశ్వర్లు, చిన్నకంభం వైఎస్సార్‌ సీపీ నాయకులు రసూల్, సాగర్, గుండం, గజ్జల ఓంకారం, మాజీ ఎఎంసీ చైర్మన్‌ చెన్నారెడ్డి, మాజీ జెడ్పీటీసీ జాకీర్, మాజీ ఎంపీపీలు రవికుమార్, ఓసురారెడ్డి, నాయకులు కొత్తపల్లిశ్రీను, శరబారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఘన స్వాగతం పలికిన నాయకులు
బేస్తవారిపేట: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంతో పాటు, తాను అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకునేందుకు చేపట్టిన పాదయాత్ర గురువారం బేస్తవారిపేట మండలంలోకి చేరింది. వెంకటేశ్వరస్వామి భారీ ప్రతిమ, వెంకటేశ్వర స్వామి సంకీర్తనలతో కోళాట భజనల నడుమ కోటస త్యమాంబదేవి ఆలయం వద్ద నుంచి చింతలపాలెం, సోమవారిపేట, బేస్తవారిపేట, చిన్న కంభం రోడ్డు మీదుగా అశేష జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది.

పాదయాత్రను విజయవంతం చేయాలి
రాచర్ల: తిరుమలకు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాచర్ల మీదుగా వెళుతున్నారని కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయాలని వైఎస్సార్‌ సీపీ మండల నాయకుడు యేలం మురళి గురువారం తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు.

మరిన్ని వార్తలు