రాష్ట్రంలో మరో 15 గురుకుల పాఠశాలలు

9 Feb, 2014 03:42 IST|Sakshi

 సాక్షి, గుంటూరు:  రాష్ట్రంలో కొత్తగా 15 గురుకుల పాఠశాలలను రూ.195 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులతో శనివారం గుంటూరులో నిర్వహించిన పేరెంట్స్ ఫెస్ట్ -2014 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక్కో గురుకుల పాఠశాలను రూ.13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రూ.150 కోట్ల వ్యయంతో అత్యున్నత సదుపాయాలతో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో చదివిన విద్యార్థుల్లో ఏటా 500 మందిని ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు పంపి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని ప్రవీణ్‌కుమార్ చెప్పారు.

>
మరిన్ని వార్తలు