మరో 18 మంది డీఎస్పీల బదిలీ

13 Feb, 2014 00:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీల బదిలీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం మరో 18 మందికి స్థానచలనం కల్పిస్తూ డీజీపీ బి.ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విడత 11 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. వీరిలో ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఎం.దయానందరెడ్డి, పి.వెంకటరామిరెడ్డి, టి.హరికృష్ణ, సి.ప్రభాకర్‌లతోపాటు జె.అన్యోన్య(రాజంపేట), ఎన్.మల్లారెడ్డి(వరంగల్ అర్బన్ ఎస్బీ), ఎన్.విష్ణు(విశాఖ సిటీ ఎస్బీ), మద్దిపాటి శ్రీనివాసరావు (హైదరాబాద్ డీడీ), కె.జగన్నాథరెడ్డి(హైదరాబాద్ డీడీ), పీవీ సుబ్బారెడ్డి (గుంటూరు అర్బన్ ట్రాఫిక్) ఉన్నారు. సీఐడీలో పనిచేస్తున్న ఎస్.రామ్‌గోపాల్‌రావుతోపాటు వెయిటింగ్‌లో ఉన్న డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, బి.శరత్‌బాబు, బీఆర్ శ్రీనివాసులు, జి.హరినాథ్‌బాబు, ఎల్.అంకయ్య(ఒంగోలు పీటీసీ)లకు ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా గతంలో సత్తెనపల్లి డీఎస్పీ కె.జగదీశ్వర్‌రెడ్డిని బదిలీ చేస్తూ వెలువడిన ఉత్తర్వుల్ని డీజీపీ రద్దు చేసి.. ఆయన్ను అదే స్థానంలో కొనసాగిస్తూ తాజాగా ఆదేశాలిచ్చారు.
 
 అధికారుల బదిలీలు నిలిపేస్తూ ఏపీఏటీ ఆదేశాలు
 సాక్షి, హైదరాబాద్: కర్నూలు డీఎస్పీ రమణకుమార్, బేగంపేట ఏసీపీ మనోహర్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ గోవర్ధన్‌రెడ్డిల బదిలీలను నిలిపివేస్తూ రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ) బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే నిబంధనలకు విరుద్ధంగా తమను బదిలీ చేశారని, తమ బదిలీ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ వీరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీఏటీ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. వీరి అభ్యంతరాలపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు