ఆన్‌లైన్‌లో మరో 7 వేలు

9 Oct, 2014 01:48 IST|Sakshi

రూ. 300 టికెట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం
 
తిరుమల: వేంకటేశ్వరుని దర్శనం కోసం రూ. 300 ఆన్‌లైన్ టికెట్లను రోజుకు 11 వేలు కేటాయిస్తుండగా, త్వరలోనే మరో 7వేల టికెట్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో కరెంట్ బుకింగ్ కింద ఇచ్చే రూ. 300 టికెట్లను రద్దు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. రూ. 300 టికెట్లు పోస్టాఫీసులు, మీ సేవ కేంద్రాల్లోనూ ఇచ్చేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇంటెర్నెట్ ద్వారా రూ. 300 ఆన్‌లైన్ టికెట్లు ప్రస్తుతం ఇంగ్లిష్‌లోనే అందజేస్తున్నారు. ఇకపై భక్తులు సులభంగా టీటీడీ నిబంధనలు తెలుసుకునేలా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ముద్రించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో అధికారులున్నారు.

నేటి నుంచిదివ్యదర్శనం టికెట్లు జారీ

కాలిబాట భక్తులకు గురువారం నుంచి దివ్యదర్శనం టికెట్లు జారీ చేస్తామని ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. భక్తుల రద్దీ వల్ల కొన్ని రోజులుగా కాలిబాట టికెట్లను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం రద్దీ తగ్గుముఖం పట్టడంతో  టికెట్లు ఇస్తామన్నారు.

బాసర ఆలయం మూసివేత

బాసర : చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదిలాబా ద్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని మూసి ఉంచారు. ఉదయం 6.30 గంటల నుంచి సా. 6.30 గంటల వరకు మూసి వేశారు.  చంద్రగ్రహణం తరువాత అమ్మవారికి గోదావరి నీటి తో అర్చకులు సంప్రోక్షణ చేసి పూజలు నిర్వహిం చారు. ఆలయాధికారులు సిబ్బందితో ఆలయ పరిసరాలన్నింటినీ నీటితో శుభ్రం చేశారు.
 
భద్రాద్రి ఆలయ తలుపులు మూసివేత

భద్రాచలం : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి ఆలయ తలుపులను బుధవారం ఉదయం 8.30 గంటలకు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా బుధవారం నిత్యకల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులు రాకపోవడంతో ఆలయ ప్రాంగణం బోసిపోయింది.
 

మరిన్ని వార్తలు