కనకదుర్గమ్మ గుడిలో మరో వివాదం

5 Aug, 2018 18:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇటీవల అమ్మవారికి అలంకరించిన ఖరీదైన చీర గల్లంతయింది. ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు మహామంటపంలో అమ్మవారికి ఈ చీరను సమర్పించారు. ఈ చీర విలువ రూ. 18వేలు. ఉత్సవ విగ్రహానికి అలంకరించిన కొద్దిసేపటికే చీర కనిపించకుండా పోయింది. అమ్మవారికి ఎంతో భక్తితో సమర్పించిన చీరను.. ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలికి ఇచ్చారని భక్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవారికి సమర్పించిన చీర మాయం కావడంతో ఆలయ సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ దృశ్యాలను ఆలయ అధికారులు పరిశీలిస్తున్నారు. చీర ఎలా గల్లంతయిందీ.. ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు