విశాఖ బీచ్లో మరో మృతదేహం లభ్యం

30 May, 2015 11:15 IST|Sakshi

హైదరాబాద్: విశాఖపట్టణంలోని జోడుగుళ్ల పాలెం బీచ్లో శనివారం మరో మృతదేహం లభ్యమైంది. గురువారం ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిలో లోకేశ్, రాజు మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగిలిన విజయ్ మృతదేహం కూడా లభ్యమైంది.

విశాఖ జిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న లోకేష్(19), రాజు(18), విజయ్(20) అనే ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన అలకు గల్లంతైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు