కడప ఉక్కు కర్మాగారం.. మరో కీలక అడుగు

19 Dec, 2019 03:27 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేసుకున్న ఒప్పంద పత్రాలతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ సీఎండీ మధుసూదన్, ఎన్‌ఎండీసీ ప్రతినిధి అలోక్‌కుమార్‌. చిత్రంలో సీఎస్‌ నీలం సాహ్ని, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా తదితరులు

ముడి ఇనుము సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ ఒప్పందం

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పత్రాలు మార్చుకున్న ఇరుపక్షాలు  

ఇదో చరిత్రాత్మక ఒప్పందమని అభివర్ణించిన ముఖ్యమంత్రి 

ఏటా 5 మిలియన్‌ టన్నుల ముడి ఇనుము సరఫరా చేయనున్న ఎన్‌ఎండీసీ

సాక్షి, అమరావతి: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. ముడి ఇనుము సరఫరా విషయంలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ సీఎండీ పి.మధుసూదన్, ఎన్‌ఎండీసీ ప్రతినిధి అలోక్‌ కుమార్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇది చరిత్రాత్మక ఒప్పందమని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అభివర్ణించారు.

ఈ ఒప్పందం ప్రకారం ఎన్‌ఎండీసీ ఏటా 5 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయనుంది. ఉక్కు ఉత్పత్తి ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా తొలివిడతలో కర్మాగారానికి సమీపంలో ఉన్న గనుల నుంచే ముడి ఇనుము సరఫరా చేయనున్నట్లు ఎన్‌ఎండీసీ అధికారులు తెలిపారు. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌.. ఉక్కు కర్మాగారానికి ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.

వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఈ నెల చివరి వారంలో సీఎం శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ కార్పొరేషన్‌కు 3,295 ఎకరాలను కేటాయించారు. నిర్మాణాన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని, మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభిస్తుందని సీఎం గతంలో ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా, అధికారులు పాల్గొన్నారు. 

8,000 మందికి ఉపాధి 
ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదరడంపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 8,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించనుందని ట్వీట్‌ చేశారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బైక్‌పై స్పెయిన్‌ టు అనంత

17 నుంచి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు

పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయండి

పదవి పోయిందనే చంద్రబాబు విమర్శలు 

జేసీపై కేసు నమోదు చేస్తాం

సీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు

మూడు రాజధానుల ప్రకటన..రాష్ట్రంలో పండుగ వాతావరణం

ఒకేచోట అభివృద్ధితో సీమాంధ్రకు దారుణ నష్టం

పారదర్శకత లక్ష్యంగా ప్రక్షాళన

గ్రాంట్లు ఇప్పించి ఆదుకోండి

బహుళ రాజధానులే బహుబాగు

తిరుపతిలో ‘స్కిల్‌’ వర్సిటీ

సీఎం వైఎస్ జగన్ భద్రతకు ఆక్టోపస్ టీమ్‌

‘భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దు’

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం జగన్‌ ఆలోచన మంచి నిర్ణయం: టీజీ

‘టీడీపీ ద్వంద వైఖరి బయటపడింది’

‘ప్రజలను అప్రమత్తం చేయడంలో ఏపీ ముందంజ’

బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా : జేసీ

‘బాబుకు చెప్పినా పట్టించుకోలేదు’

ఉత్తరాంధ్ర బాగుపడుతుంది : ఎమ్మెల్యే

పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు స్థిరంగా ఉండవు..

నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం

పోర్టుల నిర్మాణం: కేంద్ర నిధులు తెచ్చుకునేలా చర్యలు

‘ఆ పని చేయమని లోకేష్‌ను కోరుతున్నా’

‘మూడు రాజధానులపై సర్వత్రా హర్షం’

మైనార్టీలకు అండగా ఉంటాం: అంజాద్‌ బాషా

అమెరికా అమ్మాయి.... ఈస్ట్‌ గోదావరి అబ్బాయి

గ్రానైట్‌ రైట్‌ ‘రాతి’రేల కాసుకో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆటకైనా.. వేటకైనా రెడీ

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌

ఇది చాలదని చరణ్‌ అన్నారు

బ్లాక్‌బస్టర్‌ బహుమతి

సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను

డిఫరెంట్‌ లుక్స్‌లో కీరవాణి తనయుడు..