మరో కీచక టీచర్

18 Aug, 2014 04:28 IST|Sakshi
మరో కీచక టీచర్
  •      పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం
  •      పోలీసులకు ఫిర్యాదు
  •      న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా
  •      టీచర్‌ను సస్పెండ్ చేసిన  డీఈవో
  • చౌడేపల్లె: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో కీచ క టీచర్ వెలుగులోకి వచ్చాడు. పదో తరగతి విద్యార్థినిపై అత్యాచార య త్నానికి పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధిత విద్యార్థి, సహ విద్యార్థినుల కథనం మేరకు.. మండలంలోని గోసలకురప్పల్లెకు చెందిన విద్యార్థిని (15) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోం ది. ఆదివారం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామని గణితం ఉపాధ్యాయుడు రమేష్‌కుమార్‌రెడ్డి చెప్పడంతో వెళ్లారు.

    చాలామంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో క్లాసు లు నిర్వహించకుండా విద్యార్థులతో క్లాసులకు సున్నం కొట్టించే పని మొదలుపెట్టాడు. అదే సమయంలో గేమ్స్ రూమ్ తాళాలు తెప్పించాడు. ఒక బాలిక దాహం వేస్తుందని చెప్పడంతో ఆమెకు గేమ్స్ రూమ్ తాళాలిచ్చి నీరు తాగి రమ్మని చెప్పాడు. ఆ బాలిక నీరు తాగుతుండగా వెనుకనే వచ్చిన ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు వి షయం చెప్పింది.

    పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీసులు అత న్ని అదుపులోకి తీసుకున్నారు. సహచర ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కీచక ఉపాధ్యాయుడిపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ ధర్నా చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు డిమాండు చేశా రు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
     
    కీచక ఉపాధ్యాయుడు సస్పెన్షన్
     
    బాలికపై అత్యాచారానికి ప్రయత్నిం చిన కేసులో రమేష్‌కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి ఆదివారం ఫోన్ ద్వా రా ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరిపి, పునరావృతం కాకుం డా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
     

మరిన్ని వార్తలు